ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట..

తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం ఒడ్డున బంగారం బయటపడుతుంది. దీంతో జనాలు ఎగబడి బంగారం కోసం వేట మొదలుపెట్టారు. ఇసుకలో చిన్నచిన్న బంగారం ముక్కలు కన్పించడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని వాటిని ఏరుకునేందుకు పోటీపడ్డారు. మహిళలు, చిన్నారులు సైతం తీరంలో బంగారం కోసం వెతుకుతున్నారు.

ఇప్పటికే మహిళలకు బంగారు రేణువులు, రూపులు, చెవి దిద్దులు, ఉంగరాలుతో పాటు పలు బంగారు, వెండి వస్తువులు దొరికాయని చెప్పుకుంటున్నారు. గతంలోని రాజుల కోటలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుఫాన్ సమయాల్లో బయటపడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. బంగారం దొరుకుతుండటంతో మత్స్యకారులు చేపల వేటకు కూడా వెళ్లకుండా ఉప్పాడ తీరంలోనే తిష్టవేశారు.