శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయంలో అమిత్ షా పూజలు

amit-shah-offers-prayers-at-vaishno-devi-temple-in-katra

శ్రీనగర్‌ః కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా కత్రాలోని శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన వెంట జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఉన్నారు. కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా ఈ దేవాలయాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

జమ్మూలోని కన్వెన్షన్ సెంటర్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు వివిధ ప్రాజెక్టులకు అమిత్ షా ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రాజౌరిలో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం జమ్మూలోని రఘునాథ్ ఆలయంలో ఆయన ప్రార్థనలు చేస్తారు. 2019 ఆగస్టులో మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అమిత్ షా జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించడం ఇది రెండోసారి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/