ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ..ప్రకటించిన కాంగ్రెస్

teenmar-mallanna-joined-congress

తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ మెగా ఆఫర్ ఇచ్చింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించినప్పటికీ..గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో, ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో మల్లన్న ను కాంగ్రెస్ ప్రకటించింది.