క‌ళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మూవీ టాక్

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ మూవీ భారీ అంచనాల మధ్య ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.బింబిసార తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ..ఇప్పుడు అమిగోస్ తో థియేటర్స్ లలో అడుగుపెట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ ద్వారా రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా అషికా రంగనాథ్ హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఈ మూవీలో హీరో కల్యాణ్ రామ్ మూడు పాత్రల్లో త్రిపాత్రాభినయం చేయడం జరిగింది. సినిమాకు సంబదించిన లిరికల్ వీడియోలు , టీజర్, బాలయ్య నటించిన ధర్మ క్షేత్రం సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. అంటూ సాగే రీమిక్స్ సాంగ్ , ట్రైలర్ ఇలా అన్ని కూడా సినిమా ఫై అంచనాలు పెంచేయడం తో..సినిమా ఎలా ఉంటుందా అనే ఆత్రుత అభిమానుల్లో , సామాన్య ప్రేక్షకుల్లో పెరిగింది. మరి సినిమా ఎలా ఉంది..? ప్రేక్షకులు ఏమంటున్నారు..? అనేది చూద్దాం.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ న‌ట‌న అద్బుతంగా ఉందని , ముఖ్యముగా మైఖేల్ పాత్ర‌లో సూప‌ర్బ్ యాక్టింగ్ అని కామెంట్స్ పెడుతున్నారు. ద‌ర్శ‌కుడు రాజేంద్ర రెడ్డి సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించార‌ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక జిబ్రాన్ సంగీతం మేజ‌ర్ ఎసెట్ అని అంటున్నారు. కళ్యాణ్ రామ్ తన పెర్ఫామెన్స్‌తో మెరిశాడని, ఆషికా రంగనాథ్ అందంగా ఉందని పాటలు, బ్యా గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా ఉన్నాయని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ‘పాత్రల పరిచయం, ఇంటర్వెల్ పర్వాలేదు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ సాధారణంగా ఉంది. మంచి స్క్రీన్‌ప్లే యాక్షన్ సీన్స్, కైమాక్స్.. సెకండ్ హాఫ్ బావుంది అని ఇంకొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా సినిమా కు పాజిటివ్ టాక్ వస్తుంది. పూర్తి రివ్యూస్ పడితే కానీ సినిమా ఏంటి అనేది తెలుస్తుంది.