తారకరత్న కు నివాళ్లు అర్పిస్తున్న సినీ , రాజకీయ ప్రముఖులు

23 రోజుల క్రితం గుండెపోటుకు గురై మృతువు తో పోరాడిన తారకరత్న చివరకు నిన్న శనివారం రాత్రి కన్నుమూశారు. తారకరత్న ఇకలేరు అనే వార్త నందమూరి అభిమానులు , టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారని అంత భావిస్తున్న తరుణంలో ఇలా భౌతిక కాయం రావడం తట్టుకోలేకపోతున్నారు. బెంగళూరు నుంచి గత రాత్రి అంబులెన్స్‌లో బయలుదేరిన ఆయన భౌతికకాయం రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన నివాసానికి చేరుకుంది. తారకరత్నను కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు.

తారకతర్న మృతి పట్ల ప్రధాని మోడీ , హీరో రవితేజ, నాగశౌర్యతోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు, టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖరరెడ్డి, బక్కిన, అర్వింద్ కుమార్ గౌడ్ , సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు.

అలాగే తారకరత్న భౌతికకాయానికి జూనియర్ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ , వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నివాళ్లు అర్పించారు. రేపు ఉదయం ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్‌కు తరలించి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.