నటుడు జోగినాయుడికి జగన్ ప్రభుత్వం కీలక పదవి

వైస్సార్సీపీ లో చేరిన సినీ ప్రముఖులకు జగన్ కీలక పదవులు అప్పగిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య అలీకి ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి అప్పగించగా.. ఈ మధ్యనే పోసాని కృష్ణ మురళి కి ఏపీ ఏఫ్ డీసీ (ఫిల్మ్ డెవలప్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేష్) కు చైర్మన్ గా బాధ్యతలను అప్పగించింది. ఇక ఇప్పుడు నటుడు జోగి నాయుడుకు కీలక పదవి అప్పగించారు జగన్‌.

ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా ఎల్. జోగినాయుడు ను నియమించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా ఎల్. జోగి నాయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.రజత్ భార్గవ ఈ మేరకు 17 ఫిబ్రవరి, 2023న జీవో నంబర్ 46 జారీ చేశారు.జోగినాయుడు నియామకానికి సంబంధించి ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ విజయవాడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తదుపరి చర్యలు చేపట్టనున్నారు.