రంగురంగుల జ్యూస్
రుచి: వెరైటీ జ్యూస్ ఫ్లేవర్స్
అలంకారం స్థాయి మనిషినీ, ఇంటినీ దాటి ఆహారాన్ని ఎప్పుడో అందుకుంది. కంటికి ఇంపయితేనే నోటికి ఇంపవుతుంది అన్న మాటను అక్షరాలా పుణికి పుచ్చుకున్నాయి . లేయర్డ్ జ్యూసులూ, ఐస్‌క్రీంలూ, స్మూతీలూ, కోల్‌టీలూ ఇలా మనం ఇష్టంగా ఆరగించేవన్నీ ఇలా రంగురంగుల వరసల్లో కనువిందు చేస్తున్నాయి.
కోవా, సబ్జాగింజలూ, డ్రైఫ్రూట్లూ, పాలతో తయారయ్యే ఫాలుదా కూడా ఈ రకంగా ముస్తాబవ్ఞతోంది.
నోరూరించేలామామూలుగా అయితే మనం ఒక జ్యూస్ ఆర్డరిచ్చామంటే ఒకటే జ్యూస్ తాగుతాం.
కానీ ఇలాంటి వాటిలోనైతే మూడు, నాలుగు రకాల జ్యూసుల్ని ఒకేసారి రుచిచూడొచ్చు. అలాగే ఐస్‌క్రీంలోనూ నాలుగైదు ప్లేయర్లను చప్పరించేయొచ్చు.
మనలో కొంతమందికి పెరుగన్నంలోనో, పెరుగుతోనో మామిడి పండునూ లేదా అరటిపండునూ కలగలిపి తినడం అలవాటు ఉంటుంది.
అలాంటి వాళ్ల కోసం పెరుగూ, మామిడి, అరటిలాంటి ఫ్లేవర్ల కలబోతగనూ వీటిని తయారు చేయొచ్చు. లేయర్డ్ ఐస్‌క్రీంను చేసేందుకు ఒక్కోఫ్లేయర్‌నూ గ్లాసులో పోసి ఫ్రీజ్ చేసి మళ్లీ మరో ప్లేవర్‌ను జోడిస్తారు.
అదే జ్యూస్‌ల్లాంటివయితే వాటిని చిక్కగా తయారు చేయడం, లేదా ఫ్రీజ్ చేయడం ద్వారా ఒకదాని మీద ఒకటి కనిపించేలా చేస్తారు.
కొన్ని రకాలను తయారు చేసేందుకు వాటిని గ్లాసుల్లో పోసే విధానమూ ప్రత్యేకంగా ఉండాలి. ఈ తరహావాటిని ఎలా తయారు చేసుకోవాలి అన్నదానికి సంబంధించి కొన్ని వీడియోలూ యూట్యూబ్‌లో ఉన్నాయి. వాటిని చూసి మనమూ ప్రయత్నించొచ్చు.
ఇక, ఇలాంటి వరసలు తయారు చేసేప్పుడు పండ్లముక్కలూ, డ్రైఫ్రూట్లు, సబ్జాగింజల్లాంటి వాటిని జత చేసుకోవచ్చు. మనకు నచ్చినవి కనువిందుగా చేసుకుంటూనే ఆరోగ్యాన్నీ పెంపొందించుకోవచ్చు.
జ్యూసులూ, ఐస్‌క్రీంలే కాదు సాయంత్రాలు రిలాక్సయ్యేలా యర్ట్ టీలూ,కాఫీలూ కూడా తయారు చేస్తున్నారు
మొత్తానికి రంగుల మేళవింపుగా కనిపించే ఈ లేయర్డ్ రుచుల్ని ఎండవేళ చల్లచల్లగా అతిథులకు అందించారంటే వారు మీ ఆతిథ్యాన్ని ఎప్పటికీ మరచిపోరంటే అతిశయోక్తి కాదు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/