ముందుచూపుతో చైనాకు చెక్‌పెట్టాలి

కరోనా విషయాన్ని జోడించి ఒత్తిడి పెంచాలి

China has to check
China has to check

మనకు ఓ కిలోమీటరు దూరంలో ఉన్న పక్కబస్తీలో ఓ గుండానో,రౌడీనో ఉంటే పెద్ద భయం ఉండదు.కాని మనఇంటి ఎదురుగానో, పక్కన్నో వెనకనో ఉంటే రోజూ భయంతో బతక వలసి ఉంటుంది.

సరిగ్గా అదే పరిస్థితి మనదేశానికి గుంటనక్క చైనాతోఉంది. దీనికంతటికి కారణం గాంధీజీ అండదండలతో ప్రధానమంత్రి పదవి చేజిక్కించుకున్న స్నేహమే కారణం. 1950లో కోకో ఐలాండును మయన్మార్‌ దేశానికి గిఫ్ట్‌గా ఇచ్చారు నెహ్రూ. ఈ కోకో ఐలాండ్‌ ఇప్పటి వరకు కూడా చైనా ఆధీనంలోనే ఉంది.

ఇక్కడ చైనా తన సైనిక బలగాలను ఉంచి మనపై నిరంతరం నిఘా ఏర్పా టు చేసింది.

మనీపూర్‌ రాజు రాజా భువన చంద్ర కాబావలి ప్రాంతాన్ని 1952లో భారత్‌లో కలపమని మనకిస్తే దాన్ని కూడా నెహ్రూ మయన్మార్‌ దేశానికిచ్చారు.ఈ ప్రాంతం కాశ్మీరు కంటే కూడా అందంగా ఉంటుంది.

ఈ కాబావలి సగభాగాన్ని కూడా చైనా అద్దెకు తీసుకొని ఇప్పటి వరకు కూడా సైన్యాన్ని మోహరింపచేసి ఉంచుతుంది.

ఇక నేపాల్‌ విషయానికొస్తే 1947లో స్వాంతంత్య్రం రాగానే అప్పటి నేపాల్‌ రాజు త్రిభుషణ్‌ షా మనదేశాన్ని హిందూ రాజ్యంగ ప్రకటిస్తే మన దేశంలో నేపాల్‌ను కలుపుతామని, ఓ రాష్ట్రంగా ఉంటామని తెలిపారు.

అప్పుడు నెహ్రూ మాది సెక్యులర్‌ దేశమని హిందూ దేశంగా ప్రకటించడం కుదరన్నారు. ఇక యుఎన్‌ఒలో మన దేశానికి శాశ్వత సభ్యత్వ అవకాశం రెండుసార్లు వచ్చింది.

1950లో అమెరికా ప్రోద్బలంవల్ల 1955లో రష్యా ప్రోద్బలం వల్ల. ఈ రెండుసార్లు కూడా నెహ్రూయే వద్దన్నారు.

ఇప్పు డేమో ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వ విషయంలో చైనా అడుగడుగునా అడ్డుతగులుతుందది.

నెహ్రూ చేసిన ఈ తప్పు లన్నింటిని ఉపప్రధాని వల్లభాయి పటేల్‌ వ్యతిరేకిస్తూ వచ్చినా కూడా ఫలితం లేకుండాపోయింది.పక్కలోబల్లెం లాగాపాకిస్థాన్‌ ఉగ్రవాదులను మనదేశంలోకి నిరంతరం పంపించే దానిలో కూడా చైనా ప్రమేయం ఉంది.

రెండు మూడు దేశాలు తప్ప ప్రపంచంలో 319 దేశాలు మనదేశం పట్ల, మన ప్రధాని మోడీ పట్ల గౌరవ మర్యాదలు చూపించడంతో చైనా అసూయతో రగిలిపోతుంది.

మొన్నటివరకు కూడా నేపాలీయులు, భారతీయుల పట్ల ఎంతో అభిమానంగా ఉండేవారిని మన శత్రుదేశంగా తయారు చేస్తుంది చైనా. టిబెట్‌, భూటాన్‌లను అలాగే చేసింది.

ఇంకో పొరుగు దేశం శ్రీలంకను కూడా మనకు శతృదేశంగా తయారు చేయాలనుకుంది. కాని లంకేయులు ఎవ్వరి మాట వినరు.

1962 చైనాతో యుద్ధం జరిగినప్పుడు మనకు స్వాతంత్య్రం వచ్చికేవలం 15 సంవత్సరాలే అయింది.

అప్పుడప్పుడే మనం అభివృద్ధి బాటపట్టాం. అందుకే అన్ని రకాలుగా ఆ యుద్ధంలో నష్టపోయాం. కాని ఇప్పుడు చైనా కంటే మనం బలవంతులం.

అంతేకాకుండా ఇప్పుడు విలయ తాండవం చేస్తున్న కరోనాను చైనాయే పుట్టించి ప్రపంచంపై వదిలిందని ప్రపంచదేశాలన్నీకూడా చైనాపట్లకోపంతో ఉన్నా యి.

మనకున్న బలంతోపాటు ప్రపంచదేశాల బలం కూడా ఉంటుంది.రాత్రిడ్రాగన్‌ సైన్యం పక్కాప్లాన్‌తో జరిపిన దాడిలో మనవాళ్లు 20 మంది హతులయ్యారు.

ఈ చర్యను ప్రపంచ దేశాలన్నీకూడా విమర్శించాయి. రెండు,మూడు తప్ప.

ఈ తరు ణంలో చైనాఉత్పత్తులను భారత్‌లో అమ్మోద్దని, బహిష్కరించా లని ప్రజలు నిరసనలు వ్యక్తంచేస్తున్నారు.కాని చైనా ఉత్పత్తుల నిషేధంకన్నా ముందు దేశీయంగా పరిశోధన, అభివృద్ధి సదు పాయాలను మెరుగుపరుచుకొనవలసిన అవసరం ఉంది.

దేశ శాస్త్ర,సాంకేతిక విభాగానికి చెందిన ఎన్‌ఎఫ్‌టిఎమ్‌ మేనేజ్‌మెం ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2004-15 మధ్యకాలంలో భారతదేశం ఆర్‌అండ్‌డిపై చేసిన ఖర్చు మన స్థూలజాతీయోత్పత్తిలో కేవలం 0.7శాతం. కంపె నీలకు చైనా అతిచౌకగారుణాలిస్తుంది.

మనదేశంలో ఈ పరిస్థితి లేదు. తోడుక్కునే చొక్కాల నుండి సెల్‌ఫోన్ల వరకు దాదాపు అయిదువందల రకాల చైనా ఉత్పత్తులు మనదేశంలో విరివిగా వాడుతున్నాం.

యువతను బాగా ఆకర్షిస్తున్న చొక్కా ఒకటి మూడు వందలరూపాయలే. మనదగ్గరైతే గుడ్డకొనుక్కొని కుట్టుకూలి చెల్లించాలి.

అందుకే అలాంటి రకాల ఉత్పత్తులను మనం కూడా ఉత్పత్తిచేసేస్థితికి రావాలి.అప్పుడే చైనా ఉత్పత్తు లను బహిష్కరించవచ్చు.

గత ప్రభుత్వాలు చైనానుండి వచ్చే ముడిసరుకులపైననే ఆధారపడ్డాయి.కానీ సొంతంగా వాటిని తయారుచేసుకోవాలి అని ఆలోచించలేదు.

ఔషధాల తయారీలో ప్రపంచంలో మనదేశంఅగ్రగామే కావచ్చు.కాని అవి తయారు చేయడానికిఉపయోగించే ముడిపదార్థాల విషయంలో 80 శాతం చైనాపై ఆధారపడి దిగుమతి చేసుకుంటున్నాం.

గత ఆర్థికసంవత్సరంలో మనదేశం అక్షరాల 1,74000 కోట్లరూపా యల విలువైన ఔషధముడిపదార్థాలను దిగుమతిచేసుకున్నాం.

1991నాటికి మనదేశంలో ఔషధ ముడిపదార్థాల దిగుమతి విషయంలో ఒకశాతంఉండేది.2019నాటికి 70శాతందాటింది. అందులో 80శాతంఒక్క చైనావే.

ఇటువంటి విపత్కర పరిస్థి తిలో మనంముందుచూపుతో చైనాకు చెక్‌పెట్టాలి. కరోనా విషయాన్ని జోడించి విదేశీపరంగా చైనాపై ఒత్తిడి పెంచాలి.

-మునిగింటి శతృఘ్నచారి (రచయిత: కార్యదర్శి, రాష్ట్ర బి.సి సంఘం తెలంగాణ)

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/