భోజనం వేడిగా ఉండేలా

ఇంటింటి సామగ్రి

Keep the meal hot
Keep the meal hot

చాలా పదార్థాలు వేడిగా ఉంటేనే తినడానికి బాగుంటాయి. కానీ వండిన వెంటనే తినేయడం ప్రతిసారీ సాధ్యం కాదు.

ఈ సాల్టన్‌ కార్డ్‌లెస్‌ వర్మింగ్‌ ట్రే ఉంటే ఆ సమస్యే ఉండదు. రీఛార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే ఈ ట్రేని ఎనిమిది నిమిషాలు ఛార్జ్‌ చేస్తే చాలు.

దానిమీద పెట్టిన గిన్నెల్నీ అందులోని పదార్థాల్నీ గంటపాటు వేడిగా ఉంచుతుంది.

రోజువారీ తినే భోజనం, టిఫిన్‌, కాఫీ టీలతో సహా అన్నిటినీ ఈ ట్రేలో పెట్టి డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టుకోవచ్చు.

అతిథులు వచ్చినప్పుడు పాయసం, సూప్‌లాంటి వాటినీ ఈ ట్రేతో నేరుగా తీసుకెళ్లి వారి ఎదురుగా పెట్టొచ్చు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/