మహిళ తలచుకుంటే.. .
ఎందరెందరో చిత్రసీమ ధృవతారలు .. అతివలు అన్నిటా ఆధిక్యం

పురాణాలలో పునీతులు పతివ్రతులుగా సీత, తార, అహల్య, ద్రౌపది, సావిత్రి, మండోదరి, అనసూయ చిర యశస్సుతో యుగయుగాలకు ఆదర్శంగా చెప్పుకోబడుతున్నారు.
ఆధునిక కాలంలో స్త్రీలు
సంస్కరణలలో, ఉద్యమాలలో పాల్గొన్న ధీరవనితలు శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి, దుర్గాబాయి దేశ్‌ముఖ్, దువ్వూరి సుబ్బమ్మ, తెలంగాణా స్త్రీ సరోజినీ నాయుడు, ‘నైటింగేల్ ఆఫ్ ఇండియాగా గాంధీజీతో దండి, ఉప్పు సత్యాగ్రహాలలో పాల్గొన్న సాహసి.
రంగస్థల నటీమణులుగా, తొలి సినిమాలలో తమ పాటలు తామే పాడుకుంటూ స్వయంప్రతిభలు ప్రదర్శించిన వారిలో సురభి కమలాబాయి, కన్నాంబ, సావిత్రి, అంజలి, జమున, బి.సరోజాదేవి, కృష్ణకుమారి, జానకి, గిరిజ, గీతాంజలి, వాణిశ్రీ, జయప్రద, జయసుధ.
గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరుగా సూర్యకాంతం, ఛాయాదేవిలు ఇంకా జి.వరలక్ష్మి, ఎస్ వరలక్ష్మి, ఎందరెందరో చిత్రసీమ ధృవతారలుగా ప్రకాశించారు.

ఉత్తరాది గాయనీమణులుగా ప్రపంచగాయని లతామంగేష్కర్, ఆషాభోంస్లే, నూర్జహాన్, అనురాధాపౌడ్వాలు.
గాయనీ ప్రముఖులుగా సుశీల, జిక్కి, లీల, జమునారాణి, వసంత, ఎపి.కోమల, వైదేహి, జానకి, స్వర్ణలత, చిత్ర వంటి వారు అసమాన గాన వైదుష్యంతో పాత్రలకు అనుగుణంగా పాటను పాడారు
సుసంపన్నగావించిన సినీగాన ప్రియుల ఆరాధ్యదేవతలుగా తమ గంధర్వగానాలను శాశ్వతం గావించారు. జానపద సంగీతంలో తిరుగులేని సంగీతాన్ని అందించి ఆయా పాటలకు ప్రత్యేకతను ఆపాదించిన , సేకరింరిచన గాయనిలు, సోదరీమణులు సీత అనసూయల పేర్లు తెలియనివారుండరు.
టంగుటూరి సూర్యకుమారి, కంచుగంట వంటి తన కంఠంతో అనేక దేశభక్తి, లలిత గీతాలకు ప్రాణం పోశారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి భరణీ సంస్థ అధినేతగా, నిర్మాతగా, గాయనిగా, రచయిత్రిగా నటిగా మహిళ తలచుకుంటే చేయలేని పనులే ఉండవని నిరూపించిన పరిమళాల మల్లీశ్వరి శ్రీమతి భానుమతి.
ఇక రాజకీయరంగంలో 18 యేళ్లు నిరాఘాటంగా ఇండియాను పరిపాలించిన శ్రీమతి ఇందిరాగాంధీ ధైర్యసాహసాలు, మహిళా లోకానికే గర్వకారణం.
వితంతు వివాహాలను, బాల్యవివాహాలను, వరకట్న సమస్యలు పరిష్కరించడంలో మహిళలకు తోడ్పడిన పురుషులలో కందుకూరి వీరేశలింగం గారి వంటి వారు ఉన్నారు.
అబలలని సబలలుగా అనుకుని వారికి అండదండలు అందించే వారిలో వారి నైపుణ్యాలను, అణచివేయని సహృదయతలు కొందరు పురుషులలోనూ ఉంటాయి.
సమాజంలో భార్యాబాధితులు, భర్తాపీడితులు, ఉన్నంత మాత్రాన మొత్తం మానవ వ్యవస్థే అవస్థగా అనుకోకూడదు.
అల్లర్లు ఆగడాల వల్ల ప్రగతి, ఎవరికీ దొరకదు. అభివృద్ధి కావాలంటే భిన్నత్వంలో ఏకత్వంగా స్త్రీలు కూడా అన్ని రంగాలలో ప్రోత్సహించబడేలా ప్రభుత్వాలు సహకరించాలి. వారికి తగిన ఉపాధులు కల్పించాలి.
బ్రతుకు బాటలు సుఖంగా సాగాలంటే స్త్రీల శ్రమ తెలివితేటలు ఎంతో అవసరం.
అప్పుడే తల్లిగా, చెల్లిగా భార్యగానే కాక బయటి ప్రపంచంలో స్త్రీ తన శక్తి సామర్ధ్యాలతో, కీర్తి ప్రతిష్టలు ఆర్జించగల కవిగా గుర్తింపు పొందగలదు.
ముదితలు నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించిననే అన్నా, కలకంట కన్నీరు ఎప్పటికీ చేటేనని ఎందులోను తీసి పోదని గ్రహించాలి.
- యం.వి. రమణకుమారి
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/