మలబద్ధకం వదిలించే పీచు పదార్థాలు
ఆహారం ..ఆరోగ్యము

పరీక్షల వేళ పిల్లల్లో ఒత్తిడి సహజం. ఆ ప్రభావంతో ఆకలి మందగిస్తుంది. ఫలితంగా సరిపడా పోషకాలు అందక, వ్యాధినిరోధక శక్తి కుంటుపడుతుంది.
దాంతో రాత్రుళ్లు నిద్ర పట్టదు. నిద్రలేమితో పలు శారీరక సమస్యలు మొదలవ్ఞతాయి.
దాంతో తేలికగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడతారు. దాంతో నిద్ర పట్టని పరిస్థితి తలెత్తుతుంది. అందువల్ల పరీక్షలకు చాలా ముందునుంచే పిల్లలకు పౌష్టికాహారం విషయంలో శ్రద్ధ చూపడం చాలా అవసరం.
ఆహారంలో పోషకాల లోపమేమీ లేకపోయినా నిద్రలేమి ఉంటే, అది పూర్తిగా మానసిక అంశం అవ్ఞతుంది.
పరీక్షల తాలూకు ఒత్తిళ్లు భయాందోళనలను తగ్గించడానికి అవసరమైతే మానసిక నిపుణలను కలవాలి.
పరీక్షల సమయంలో తలనొప్పికి నిద్రలేమి ప్రధాన కారణం. కొంత మంది పిల్లల్లో దృష్టిలోపాల వల్ల కూడా తలనొప్పి రావచ్చు.
అంతకుముందు నుంచే ఆ సమస్య ఉంటే పరీక్షల సమయంలో రెట్టింపు ఒత్తిడి ఉండడం వల్ల తలనొప్పి రావచ్చు.
ఒత్తిళ్లతో కొందరికి ఆకలి మందగిస్తే, మరికొందరికి ఆకలి పెరుగుతుంది. ఈ రెండూ సమస్యలు ఇబ్బంది పెట్టేవే.
దీంతో ఇన్ఫెక్షన్లు, కడుపు ఉబ్బరంతోపాటు, వాంతులూ అవవచ్చు. మలబద్ధకాన్ని నిరోధించడానికి పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు ఇవ్వాలి.
చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. గోరు వెచ్చని నీళ్లు తాగాలి. ఒత్తిడికి లోనయ్యే పిల్లలకు జ్వరం తగ్గే మాత్రలు ఇస్తూ వాళ్లలో మానసిక స్థైర్యం పెంచేలా వ్యవహరించాలి.
ఒంటినొప్పులు ఉన్నట్లయితే విటమిన్లు, లవణాలు తగ్గినట్లు గ్రహించాలి.
ఇలాంటప్పుడు పండ్లు ఇవ్వాలి. పండ్ల రసాలు కూడా ఇవ్వాలి. రాత్రిపూట తొందరగా భోజనం ముగించేలా చూడాలి.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/