బొంగు చికెన్ వండిన రాహుల్ గాంధీ

బొంగు చికెన్ అంటే చాలామంది నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడతారు. వెదురు బొంగులో చికెన్ వండే విధానం, దాని రుచి గురించి చెప్పాల్సిన పనిలేదు. అలాంటి బొంగు చికెన్ ను కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలతో కలిసి వండారు. వండడమే కాదు పార్టీకి చెందిన తెలంగాణ నేతలు, గిరిజనులతో కలిసి బొంగు చికెన్ రుచి చూశారు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో మీడియా లో చక్కర్లు కొడుతుంది.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ లో సక్సెస్ ఫుల్ గా పూర్తయిన సంగతి తెలిసినా. ఈ యాత్ర లో లక్షలాది మంది కాంగ్రెస్ కార్య కర్తలు పాల్గొన్నారు. రాహుల్ వెళ్లిన ప్రతి చోట ప్రజలు బ్రహ్మ రధం పట్టారు. రాహుల్ సైతం ఎంతో ఉత్సహంగా పాల్గొన్నారు. కాగా యాత్ర లో రాహుల్ గిరిజనుల తో కలిసి బొంగు చికెన్ వండారు. అంతే కాదు గిరిజనులు, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బొంగు చికెన్ రుచి చూసి మెచ్చుకున్నాడు. ఈ అరుదైన ఘటనకు చెందిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) శనివారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇటీవలే తెలంగాణను దాటుకుని మహారాష్ట్రలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో యాత్ర సాగుతున్న సమయంలో ఆయా ప్రాంతాలకు చెందిన సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు రాహుల్ ఆసక్తి చూపారు. ఈ క్రమంలో యాత్ర ముగుస్తున్న సమయంలో ఓ రోజు మధ్యాహ్నం టీపీసీసీ నేతలతో పాటు గిరిజనులతోనూ రాహుల్ గాంధీ పొలాల మధ్యన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాళణలో తన యాత్ర సాగిన తీరు, నేతల నుంచి అందిన సహకారం తదితరాలపై రాహుల్ చర్చించారు. ఈ సమయంలోనే పొలాల మధ్య ముచ్చట్లకు ముందు గిరిజనులతో కలిసి రాహుల్ గాంధీ భొంగు చికెన్ వండారు.