తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం రోజు మానిక్కం ఠాగూర్ ఆసక్తికర ట్వీట్..

ఈరోజు(జూన్ 2) తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం. సుదీర్ఘ పోరాటం, అలుపెరుగని ఉద్యమం, ఎందరో బలిదానాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. నేటితో ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని , తొమ్మిదోవ ఏటా అడుగుపెట్టింది. ఈ సందర్భాంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భవ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భవ వేడుకలు జరుపుకుంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు గవర్నర్​ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అన్ని పార్టీల నేతలు , సినీ ప్రముఖులు, బిజినెస్ రంగం వారు , క్రీడా కారులు ఇలా అంత కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యహహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘‘ తెలంగాణ ఏర్పాటు దినోత్సవం నాడు చరిత్రను మరిచిపోవద్దని అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం, సుశీల్ కుమార్ షిండే చేస్తున్న తెలంగాణ ప్రక్రియ ప్రకటనలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇదే సమయంలో అమిత్ షా ఎక్కడంటూ ప్రశ్నించారు. అమిత్ షా ఎక్కడ ఉన్నారు..? హత్య కేసులో జైలుకు వెళ్లి బెయిల్ లో ఉన్నాడంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Let’s not forget the History on #TelanganaFormationDay
Congress Home minister Sh ⁦@PChidambaram_IN⁩ ji & ⁦@SushilShindeINC⁩ ji announcing the process and completion of formation of Telangana. Where was Amit Shah then ? He was in Jail and then in bail for murder case. pic.twitter.com/0wMZIaQDGF— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) June 2, 2022