మా ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు చూస్తున్నారు

CM Shri Ashok Gehlot addresses Press Conference through video conference

జైపూర్‌: రాజస్థాన్‌ సిఎం అశోక్‌ గెహ్లోత్‌ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి ప్రలోభాలకు గురి చేస్తుందని.. రాజకీయాలతో ఆటలాడుతుందని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంటే.. మరోవైపు బిజెపి నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి ప్రలోభాలకు గురి చేసి.. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలో నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తోంది అని ఆరోపించారు. మా ప్రభుత్వం కరోనా ట్టడి కోసం పని చేస్తుండగా. బిజెపి మాత్రం సమస్యలను పెంచే విధంగా ప్రవర్తిస్తోంది. బిజెపి అన్ని హద్దులు దాటింది. కానీ మేం ప్రజల కోసమే పని చేస్తామని దేశం మొత్తం తెలుసు అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/