మంత్రి గంగుల కమలాకర్‌ ఎస్కార్ట్‌ వాహనం బోల్తా

కొత్తపల్లి ఎస్సై ఎల్లా గౌడ్ కు గాయాలు

TS Minster Gangula Kamalakar
TS Minster Gangula Kamalakar

కరీంనగర్‌: మంత్రి గంగుల కమలాకర్‌ ఎస్కార్ట్‌ వాహనం ప్రమాదానికి గురైంది. కరీంనగర్ జిల్లా మానకొండూరులో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేసి వస్తున్న సందర్భంగా ఆయన కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎస్కార్ట్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొత్తపల్లి ఎస్సై ఎల్లా గౌడ్ గాయపడ్డారు. ఆయన బొటనవేలు తెగిపడినట్టు సమాచారం. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ లోని ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద ఈ ఘటన జరిగింది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/