ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

CM Shivraj Singh Chouhan exercised his right to vote

న్యూఢిల్లీః ఈరోజు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ జరుపుతున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి 27.62 పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ముగియనుంది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అటు, ఛత్తీస్ గఢ్ లో నేడు రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో ఈ నెల 7న తొలి విడతలో 20 స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగిలిన 70 స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల సమయానికి 19.05 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.