రోడ్డు ప్రమాదానికి గురైన రాయపాటి అరుణ

జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు బాపట్ల జిల్లా రేణంగివరం వద్ద డివైడర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది.

ప్రకాశం జిల్లాకు చెందిన రాయపాటి అరుణను జనసేన అధికార ప్రతినిధిగా రెండేళ్ల క్రితం నియమించారు. అప్పటి నుంచి ఆమె పార్టీలో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ విధానాలను జనాల్లోకి తీసుకెల్లడం నుంచి విమర్శలను ధీటుగా ఎదుర్కోవడం… సమస్యలపై స్పందించడం వంటివి చేస్తూ వస్తుంది. అరుణ ప్రమాదానికి గురయ్యారని విషయం తెలిసి జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరుణ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.