ఆకతాయి అదును చూసి తాకాడు

ఆకతాయి  అదును చూసి తాకాడు
Tapsi pannu

తాజాగా `వాట్ ఉమెన్ వాంట్` అనే టాక్ షో లో తాప్సీ తన టీనేజ్ లో ఎదురైన ఓ భయానక అనుభవాన్ని వెల్లడించింది. గురుపూజ కోసం ఢిల్లీలోని గురుద్వారకు కుటుంబసమేతంగా వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆకతాయి తనని అసభ్యంగా తాకాడని తెలిపింది. ఆ దేవాలయం బయట నిత్యం రద్దీగా ఉంటుందిట. ఫుడ్ స్టాల్స్…బొమ్మల అంగడుల వల్ల జనంతో రద్దీగా ఉంటుందిట. దేవాలయం లోపలికి వెళ్లాలంటే వాటన్నిటినీ దాటుకుని వెళ్లడం పెద్ద సవాల్. అలాంటి సమయంలో ఓ ఆకతాయి అదును చూసి నన్ను తాకుతూ నాపై చేతులు వేసి అసభ్యంగా తాకాడు అని తాప్సీ ఎమోషన్ అయ్యింది.
జనాల మధ్యలో ఇలాంటివి సహజమేనని ముందు భావించినా.. ఆ ఆకతాయి అదే పనిగా వేళ్లతో తాకుతూ సంస్కారం అన్నదే లేకుండా హద్దు మీరడంతో ఆకతాయి రెండు వెళ్లు పట్టుకుని మెలితిప్పి విరిచేశానని తాప్సీ తెలిపింది. ఆ ఘటన ఎప్పటికీ మర్చిపోలేనిదని…సమాజంలో ఇలాంటి చీడపురుగులు ఉన్నంత కాలం స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది అంటూ తాప్సీ ఆవేదనను వ్యక్తం చేసింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/