ధమాకా భామ జోరు..మాములుగా లేదు

పెళ్లి సందD మూవీ తో తెలుగు తెరకు పరిచమైన శ్రీలీల..ప్రస్తుతం ఒకటి రెండు కాదు ఏకంగా 8 సినిమాలతో బిజీ గా ఉంది. ధమాకా మూవీ లో అమ్మడు గ్లామర్ తో పాటు తన డాన్స్ లతో యాక్టింగ్ తో యావత్ ప్రేక్షకులని కాదు దర్శక , నిర్మాతలను ఆకట్టుకుంది.

దీంతో యంగ్ హీరోల తో పాటు సీనియర్ హీరోలు సైతం తమ సినిమాల్లో శ్రీలీల నే కావాలని కోరుకుంటున్నారు. మహేష్ బాబు , పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్ , నితిన్ , జూనియర్ ఎన్టీఆర్ చిత్రాల్లో నటిస్తుంది. మరో నాల్గు ప్రాజెక్ట్స్ సైతం లైన్లో పెట్టింది ఈ భామ.

ఇదిలా ఉంటె శ్రీ లీల నటించిన ఫస్ట్ కన్నడ మూవీ..ఇప్పుడు తెలుగు లో ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. కన్నడలో శ్రీలీల ‘కిస్’ అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. 2019లో వచ్చిన ఈ మూవీ యావరేజ్ గా నిలిచినప్పటికీ.. శ్రీలీలకు మాత్రం చాలా పేరు తీసుకొచ్చింది. ఇందులో రొమాంటిక్ సీన్స్ డోస్ కాస్త గట్టిగానే ఉంటుంది. ఆ తర్వాత తెలుగులో ఛాన్సులు కొట్టేసి బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం శ్రీలీల నటించిన ‘ఐ లవ్ యూ ఇడియట్’ పేరుతో ఆహాలో రిలీజ్ చేశారు. ఏప్రిల్ 7 నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చింది.