తిరుమ‌ల శ్రీవారిన ద‌ర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth reddy visited tirumala srivaru today

తిరుమలః తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బుధ‌వారం ఉద‌యం తిరుమ‌ల శ్రీవెంక‌టేశ్వ‌ర‌ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఉద‌యం శ్రీవారికి మనవడి పుట్టు వెంట్రుకలను స‌మ‌ర్పించారు. ఆ త‌ర్వాత ఉద‌యం 8.30 గంట‌ల‌కు వీఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి త‌న భార్య‌, కూతురు, అల్లుడితో క‌లిసి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.

ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింది. కాగా, శ్రీవారి దర్శనార్థం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మంగ‌ళ‌వారమే తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్ లోని రచన అతిథి గృహంలో రాత్రి బస చేశారు.