తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

వాతావరణ శాఖ వెల్లడి

Rain forecast for Telangana
Rain forecast for Telangana

Hyderabad: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. .రానున్న 24 గంటల్లో నైరుతి రుతు పవనాలు దక్షిణ అండమాన్ సముద్రం , ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది బలపడి 24వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవాశముందని వెల్లడించింది. దీని ప్రభావంగా రానున్న 3 రోజులు తెలంగాణ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.తాజా

కెరీర్‌ సమాచారం కోసం :https://www.vaartha.com/specials/career/