బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌

CM KCR unveiled the statue of BR Ambedkar

హైదరాబాద్‌ః నవ భారత నిర్మాత బాబా సాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల.. మహా విగ్రహాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(సీఎం కేసీఆర్) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అంబేడ్కర్‌ మనవడు ప్రకాష్ అంబేడ్కర్‌ హాజరయ్యారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ సమున్నత శిఖరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరింది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం..తెలంగాణకే మణిహారంగా నిలిచింది. ఒకవైపు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన నూతన సచివాలయం..మరోవైపు అమరవీరుల స్మారకం..ఆ పక్కనే అంబేద్కర్‌ భారీ విగ్రహం..ఎన్టీఆర్ గార్డెన్, జలవిహార్, లుంబినీ పార్క్, హుస్సేన్‌సాగర్‌, బిర్లా మందిరం..హైదరాబాద్ మహానగరానికే మణిహారంగా నిలిచాయి.

ఈ సంద‌ర్భంగా అంబేద్క‌ర్ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్ ద్వారా గులాబీ పూల వ‌ర్షం కురిపించారు. ఆ పూల వ‌ర్షాన్ని సీఎం కెసిఆర్, ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు వీక్షించారు. ఈ సంద‌ర్భంగా కెసిఆర్ జై భీమ్ అని నిన‌దించారు. అక్క‌డున్న ప్ర‌జాప్ర‌తినిధులంతా చ‌ప్పట్ల‌తో పూల వ‌ర్షాన్ని స్వాగ‌తించారు. అంబేద్క‌ర్ విగ్ర‌హా శిలాఫ‌ల‌కాన్ని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ ఆవిష్క‌రించారు.