బంగాళాఖాతంలో వాయుగుండం: రాగల 24 గంటల్లో తీవ్ర తుపాను

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడి

Cyclone in the Bay of Bengal
Cyclone in the Bay of Bengal

New Delhi: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ రేపటికి తుపాను గా మారుతుందని, రాగల 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారుతుందని పేర్కొంది. యాస్ తుపాను ఈ నెల 26వ తేదీ ఉదయం ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని తాకుతుందని, సాయంత్రానికి తీరాన్ని దాటి భూభాగంపై ప్రవేశిస్తుందని తాజా బులెటిన్ లో వెల్లడించింది.

యాస్ తుపాను ప్రభావం ఏపీ, తెలంగాణపై కొద్దిమేర మాత్రమే ఉంటుందని,. రేపు ఉదయం కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని perkondi. . ఈ నెల 25, 26 తేదీల్లో ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు వాతావరణ శాఖ, తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/