తాజ్‌మహల్‌కు పర్యాటకుల అనుమతి

ఈనెల 21 నుండి తెరుచుకోన్ను తాజ్‌మహల్‌

TAJ MAHAL
TAJ MAHAL

లక్నో: ఈనెల 21 నుండి ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక క్షేత్రాలైన తాజ్ మహల్, ఆగ్రా కోట ప్రజల సందర్శనకు ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తన వెబ్‌సైట్‌లో ఈ సమాచారాన్ని వెల్లడించింది. జిల్లాలోని ఇతర స్మారక చిహ్నాలు సెప్టెంబర్ 1 నుంచే ప్రారంభించబడ్డాయి, అయితే ఆగ్రా కోట, తాజ్ మహల్ మాత్రం కరోనా సంక్రమణ కారణంగా తెరవలేదు. ఒక రోజులో గరిష్టంగా 5,000 మంది పర్యాటకులు తాజ్ మహల్, ఆగ్రా కోటలో రోజుకు గరిష్టంగా 2,500 మంది పర్యాటకులు ప్రవేశానికి వస్తుంటారు. ఇన్నిరోజుల పాటు తాజ్ మహల్ మొదటిసారి మూసివేశారు. కాగా మార్చి 17 నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోట పర్యాటకులకు అనుమతి నిలిపివేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/