నిజామాబాద్ ఆస్పత్రి ఘటనపై వైస్ షర్మిల ఆగ్రహం

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆసుపత్రికి వచ్చాడు. స్ట్రెచర్‌ అందుబాటులో లేదని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో బయట నుంచి రెండో అంతస్థు లిప్ట్ వరకు రోగి బంధువులే అతని కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటూ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. రోగి కాళ్లు పట్టుకుని లాక్కెళ్తున్నా అక్కడి వైద్య సిబ్బంది కూడా పట్టించుకోలేదు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ కావడం తో..ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటన పట్ల YSRTP అధినేత్రి వైస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదేనా ఆరోగ్య తెలంగాణ? అని నిలదీశారు షర్మిల. దొర గారూ..ఇదేనా ఆరోగ్య తెలంగాణ ? రోగులను నేలపై లాక్కొని పోవడం కార్పొరేట్ వైద్యమా?స్ట్రెచర్లు,వీల్ చైర్లు లేకపోవడమే వసతుల కల్పనా? అని నిలదీశారు. ఏటా 11వేల కోట్ల బడ్జెట్ అంటూనే..రోగికి వీల్ చైర్ కూడా అందించలేని దరిద్రపు పాలన.ఇది మీరు చెప్తున్న ఆరోగ్య తెలంగాణ కాదు..ప్రజలు చూస్తున్న “అనా రోగ్య తెలంగాణ” అంటూ ఫైర్‌ అయ్యారు.