పర్యటన లో కేసీఆర్ బిజీ బిజీ..బస్సులోనే భోజనం చేసారు

ఆకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన సీఎం కేసీఆర్ బస్సులోనే భోజనం చేశారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. పర్యటనలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతో పాటు రైతులను పరామర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న పంటల పరిశీలనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. తన కాన్వాయ్ బస్సులోనే భోజనం చేశారు. సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు భోజనం చేశారు.

బస్సులోని ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి ఎర్రబెల్లి వడ్డించారు. పులిహోరతోపాటు ఇతర ఆహార పదార్థాలను స్వయంగా వడ్డిస్తూ.. అందరూ తిన్నారా లేదా అని మరీ మరీ అడిగారు. అక్కడి నుంచి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అవడిరంగాపురానికి బయలుదేరారు. అంతకుముందు మొక్కజొన్న, మిర్చి, మామిడి తోటలను కేసీఆర్ పరిశీలించారు. కాగా.. నష్టపోయిన వాటిల్లిన ప్రతి ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. ఈరోజు ఖమ్మం , మహబూబాబాద్ జిల్లాలో నష్టపోయిన పంటలను కేసీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. రైతులు నిరాశకు గురికావొద్దు. సమస్యలు ఉన్నాయని చెప్పినా.. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వదు. కేంద్రానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒక్కటేనన్నారు.