బ్రహ్మానందాన్ని సత్కరించిన మెగాస్టార్

రంగమార్తాండ చిత్రంతో మరోసారి వెండితెర ఫై అద్భుతమైన నటన కనపరిచిన బ్రహ్మానందంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. చిరంజీవి, రాంచరణ్‌ శాలువాతో సత్కరించారు. సింధూరం , అంతఃపురం , మురారి , నిన్నే పెళ్లాడతా , ఖడ్గం , చందమామ వంటి బ్లాక్ బస్టర్ విజయాలను అందించి ఎన్నో అవార్డ్స్ దక్కించుకున్న డైరెక్టర్ కృష్ణవంశీ..చాలాకాలం తర్వాత రంగమార్తాండ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ , బ్రహ్మానందం , అనసూయ , రాహుల్ సిప్లిగంజ్ , శివాత్మిక, ఆదర్శ బాలకృష్ణ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఉగాది కానుకగా ఈ మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్‌పై కామెడీతో నవ్వించిన లెజెండరీ నటుడు బ్రహ్మానందం ఈ మూవీ లో సీరియస్‌ పాత్రలో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించాడు.

ముఖ్యంగా ప్రకాశ్ రాజ్‌, బ్రహ్మానందం మధ్య సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. బ్రహ్మానందం పోషించిన చక్రపాణి పాత్రపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్బంగా బ్రహ్మానందంకు మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. శాలువాతో సత్కరించారు. ఓవైపు మెగాస్టార్‌, మరోవైపు మెగా పవర్‌ స్టార్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న బ్రహ్మానందం స్టిల్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. అలాగే బ్రహ్మానందంతో మరోవైపు చిరంజీవి సతీమణి సురేఖ, హైపర్ ఆది, వెన్నెల కిశోర్‌, శ్రీజ కలిసి దిగిన స్టిల్‌ కూడా ట్రెండింగ్ అవుతోంది.