తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శం కావాలి

పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుస్తున్నాం

cm kcr
cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈరోజు తెలంగాణ శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ..గ్రామాల ముఖచిత్రం మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచుతున్నామని, ఆసరా పెన్షన్లతో సామాజిక భద్రతను కల్పించామని, గ్రామ పంచాయతీ ఉద్యోగులకు రెండు లక్షల బీమా కల్పించామని పేర్కొన్నారు. తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలవాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. గ్రామాల వికాసానికి దశలవారీగా కృషి చేస్తున్నామని, పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. రెండో విడతలో పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టామని, చేతి, కుల వృత్తులకు చేయూత ఇస్తున్నామని, మిషన్ భగీరథ, 24 గంటల కరెంటు సరఫరా ఇతర మౌళిక వసతులు కల్పిస్తున్నామని కెసిఆర్ వివరించారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. 40 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు జరిగాయని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులందరూ భాగస్వాములయ్యారని, వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించారని, హర్షిత, పారిశుధ్య ప్రణాళికలు రూపొందించామన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/