తెలుగు రాష్ట్రాలు అలర్ట్..కరోనా సమాచారానికి హెల్ప్‌లైన్
తెలంగాణలో 104, ఏపిలో 0866 2410978 నంబర్‌లు అందుబాటులోకి

హైదరాబాద్: కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలపై పంజా విసురుతుంది. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో నెలకొన్న సందేహాలు, అనుమానాలను నివృత్తి చేసి, సమాచారం అందించడం ద్వారా, అప్రమత్తం చేసేందుకు అటు జగన్ సర్కారు, ఇటు కేసీఆర్ సర్కారు హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చాయి. తెలంగాణలో హెల్ప్ లైన్ నంబర్ 104 ద్వారా ప్రజలు సమాచారం తెలుసుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఏపీలో 0866 2410978 నంబర్ కు ఫోన్ చేయడం ద్వారా తమకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇక సెంట్రల్ హెల్ప్ లైన్ నంబర్ గా 011 23978046 నంబర్ కూడా అందుబాటులో ఉందని అన్నారు. కాగా, ఇప్పటివరకూ ప్రపంచంలో 120 దేశాలకు పైగా కరోనా విస్తరించగా, 1,34,786 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇంతవరకూ 4,983 మంది మరణించగా, ఇండియాలో బాధితుల సంఖ్య 75కు చేరింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/