ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించిన రాజమౌళి

యావత్ సినీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం RRR (ఆర్ఆర్ఆర్). బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడం..ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలు గా నటిస్తుండడం..పాన్ ఇండియా మూవీ గా రాబోతుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొనిన్నాయి. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మొన్నటి వరకు ఈ మూవీ అక్టోబర్ , నవంబర్ నెలలో కానీ విడుదల అవుతుందని భావించారు.

కానీ ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జనవరి 7 న ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్ర యూనిట్ తెలిపారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ , రాధే శ్యామ్ , సర్కారు వారి పాట చిత్రాలు బరిలో ఉండగా..ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వచ్చి చేరడం తో సంక్రాంతి బరి మరింత వేడిక్కినట్లు అయ్యింది.

డీవీవీ పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ లో చరణ్, ఎన్టీఆర్‌కు జోడీగా అలియా భట్‌, ఓలివియా మోరిస్‌ నటిస్తున్నారు. వీళ్లతో పాటు అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, అలీ కీ రోల్స్‌ ప్లే చేస్తున్నారు.

07.01.2022. It is… 🙂 #RRRMovie #RRROnJan7th @tarak9999 @AlwaysRamCharan @mmkeeravaani @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/eQDxGEajdy— rajamouli ss (@ssrajamouli) October 2, 2021