హైదరాబాద్‌ను పవర్ ఐ లాండ్‌గా మార్చాం: సిఎం కెసిఆర్‌

cm-kcr-said-that-hyderabad-has-been-converted-into-a-power-island

హైదరాబాద్ః నగరంలోని మెట్రో రెండోదశ నిర్మాణానికి సిఎం కెసిఆర్‌ శకుస్థాపన చేశారు. అనంతరం రాజేంద్రనగర్ అప్పా జంక్షన్ దగ్గర కెసిఆర్‌ బహిరంగసభలో మాట్లాడుతూ.. హైదరాబాద్ అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకుంటామన్నారు. హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ గా మార్చినట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. న్యూయార్క్, లండన్, పారిస్ నగరాల్లో కరెంట్ పోయినా..హైదరాబాద్ లో కరెంట్ పోదన్నారు. హైదరాబాద్ దేశంలోని ఇతర నగరాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతుందని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రపంచమే అబ్బుర పడే విధంగా హైదరాబాద్ ను డెవలప్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే వరల్డ్ బెస్ట్ గ్రీన్ సిటీ, బెస్ట్ లివబుల్ సిటీ అవార్డులు హైదరాబాద్ కు వచ్చాయని వెల్లడించారు. అన్ని మతాలు, కులాలు, జాతులను అక్కున చేర్చుకున్న హైదరాబాద్..విశ్వనగరంగా మారుతుందని చెప్పారు. ఇక్కడ సమశీతల వాతావరణం ఉండటం వలన దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు భాగ్యనగరంలో నివసించేందుకు ఇష్టపడతారని చెప్పారు.

హైదరాబాద్ చరిత్రలో సుప్రసిద్దమైందనిసిఎం కెసిఆర్ అన్నారు. ఢిల్లీ కంటే వైశాల్యం, జనాభాలో హైదరాబాద్ పెద్దదని చెప్పారు. చెన్నై తో పాటు.. ఇతర నగరాల కంటే 1912లోనే విద్యుత్ వచ్చిన నగరం హైదరాబాద్ అని గుర్తు చేశారు. చెన్నైకు 1927లో కరెంట్ వచ్చిందన్నారు. దేశంలో నిజమమైన కాస్మా పాలిటన్ సిటీ హైదరాబాద్ అని కొనియాడారు. హైదరాబాద్‌ చుట్టూ కూడా మెట్రో రావాల్సి ఉంది.. కేంద్రం సహకరించినా లేకున్నా మేం పూర్తి చేస్తామని ప్రకటించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/