ఎల‌న్ మ‌స్క్‌పై ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు కేసులు

Elon Musk

శాన్‌ఫ్రాన్సిస్‌కో: ట్విట్ట‌ర్ ఓన‌ర్ ఎల‌న్ మ‌స్క్‌పై ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు కోర్టు కేసులు దాఖ‌లు చేస్తున్నారు. ట్విట్ట‌ర్‌ను సొంతం చేసుకున్న త‌ర్వాత‌.. ఆ సోష‌ల్ మీడియా సైట్‌లో ప‌నిచేస్తున్న సుమారు 7500 మంది ఉద్యోగుల‌ను మ‌స్క్ తొల‌గించిన విష‌యం తెలిసిందే. అయితే తొల‌గింపుల‌ను ప్ర‌శ్నిస్తూ మాజీ ఉద్యోగులు కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. ఆఫీసు రూమ్‌ల‌ను బెడ్‌రూమ్‌లుగా మారుస్తున్న‌ట్లుగా కూడా మ‌స్క్‌పై శాన్ ఫ్రాన్సిస్‌కోలో కేసు న‌మోదు అయ్యింది. ముందుగా మ‌స్క్ హామీ ఇచ్చిన‌ట్లు త‌మ‌కు న‌ష్ట‌ప‌రిహారం అంద‌డం లేద‌ని కొంద‌రు మాజీ ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నారు. కంపెనీకి క‌ట్టుబ‌డి ప‌నిచేయాల‌ని మ‌స్క్ ఇచ్చిన అల్టిమేట‌మ్‌ను ప్ర‌శ్నిస్తూ కూడా కొంద‌రు కేసులు దాఖ‌లు చేస్తున్నారు. 60 రోజుల వార్నింగ్ టైమ్ ఇవ్వ‌కుండానే త‌మ‌ను తొల‌గించిన‌ట్లు కొంద‌రు కేసులు బుక్ చేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/