యాదాద్రి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు

హైదరాబాద్: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఇప్పటికే యాదాద్రి చేరుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకోటికి దర్శనం ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్ సమక్షంలో యాగ జలాలతో జరిగే సంప్రోక్షణలో మంత్రులతో పాటు ప్రముఖులు పాల్గొంటారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తులు ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో యాదాద్రి చేరుకున్నారు. కాసేప‌ట్లో మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ ప్రారంభం కానుంది. కేసీఆర్ కుటుంబ స‌మేతంగా స్వయం‌భు‌వుల తొలి పూజలో పాల్గొంటారు. మ‌ధ్యాహ్నం 12:10 గంట‌ల‌కు ఆల‌య ప్ర‌వేశం జ‌ర‌గ‌నుంది. స్వ‌ర్ణ ధ్వ‌జ‌స్తంభ సంద‌ర్శ‌న ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 3 గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్‌కు సీఎం తిరిగి ప‌య‌న‌మ‌వుతారు. సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/