యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం

శోభాయాత్ర‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంప‌తులు

YouTube video
Sri Yadadri Laxmi Narasimha Swamy Maha Kumbha Samprokshana Yadadri Temple


యాదాద్రి భువ‌న‌గిరి : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొద‌ల‌య్యాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వ‌హించిన శోభాయాత్ర‌లో సీఎం కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్ర‌భుత్వ అధికారులు, అర్చ‌కులు, వేద పండితులు పాల్గొన్నారు. శోభాయాత్ర‌లో భాగంగా బంగారు క‌వ‌మూర్తులు, ఉత్స‌వ విగ్ర‌హాలు, అళ్వార్లు ప్ర‌ద‌ర్శించ‌డంతో పాటు క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. వేద మంత్రోచ్ఛ‌ర‌ణాలు, మేళ‌తాళాల మ‌ధ్య శోభాయాత్ర వైభ‌వంగా కొన‌సాగుతోంది. ఆల‌యం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు. ప్రధానాలయ పంచతల రాజగోపుర‌రం వద్ద కేసీఆర్ స్వయంగా పల్లకిని మోశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/