రాజధాని మార్పుపై సచివాలయ ఉద్యోగుల ఆవేదన
ఇప్పుడు విశాఖకు వెళ్లమంటే ఏం చేయాలో దిక్కుతోచట్లేదు

అమరావతి: ఏపి రాజధాని తరలించాలన్న యోచనపై సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సిఫారసులు చేసిన జీఎణ్ రావు, బీసీజీ కమిటీలు తమ అభిప్రాయాలను తీసుకోలేదని అన్నారు. అందువల్ల, రాజధానిగా అమరావతే ఉంటుందని అనుకున్నామని మీడియాకు ఉద్యోగులు తెలిపారు. రాజధాని తరలించరని భావించి రుణాలు తీసుకుని ఇక్కడే ఫ్లాట్లు కొనుగోలు చేశామని, ఇప్పుడు విశాఖకు వెళ్లమంటే ఏం చేయాలో దిక్కుతోచడం లేదని అన్నారు. రాజధాని తరలింపు విషయమై ఉద్యోగ సంఘాల నాయకులు కూడా సరిగా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్విభజన తర్వాత హైదరాబాద్ నుంచి అమరావతి రావాలంటేనే ఇబ్బంది పడ్డామని గుర్తుచేసుకున్నారు.
తాజా చెలి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/women/