“జమిలి” ఎన్నికలపై సీఎం కేసీఆర్ సమావేశం…

కేంద్రం బిజెపి సర్కార్ ‘ వన్ నేషన్.. వన్ ఎలక్షన్ ’ నినాదంతో జమిలి ఎన్నికలకు వడివడిగా అడుగులు వేస్తోంది. సాధ్యాసాధ్యాలపై అధ్యయానికి ఎనిమిది మంది సభ్యలుగా మాజీ రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ నాయకత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలూ ముందస్తు ఎన్నికల కరసరత్తులో భాగంగానే అన్న అభిప్రాయమూ బలంగా వ్యక్తమవుతోంది.

ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ‘ వన్ నేషన్.. వన్ ఎలక్షన్ ’ ఫై శుక్రవారం ప్రగతి భవన్ లో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లతో పాటు కొందరు ముఖ్యనేతల సమక్షములో భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఎలాగు పార్లమెంట్ లో అధిక బలం ఉన్నా బీజేపీ బిల్లును అడ్డుకోవడం జరగదు కాబట్టి… ఒకవేళ దేశం మొత్తం మీద ఎన్నికలు ఒకేసారి జరిగితే .. అందులోనూ అసెంబ్లీ మరియు పార్లమెంట్ లకు ఒకే సారి ఎన్నికలు వస్తే ఏ విధంగా తమ కార్యాచరణ ఉండాలి అన్న విషయంపైన ముఖ్యంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.