రష్యాకు పయనమైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

defence-minister-rajnath-singh

న్యూఢిల్లీ: ఈరోజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యాకు బయలుదేరారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాస్కోలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. రష్యా, చైనా రక్షణ మంత్రులతో రాజ్‌నాథ్‌ కీలక చర్చలు జరుపుతారని తెలుస్తోది. ఈ నేపథ్యంలో లడఖ్ సరిహద్దులో భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గవచ్చని సమాచారం. కాగా భారతీయ వాయుసేనకు చెందిన విమానంలో రాజ్‌నాథ్‌ సింగ్ రష్యాకు పయనమయ్యారు.


తాజా వీడియోస్‌ క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/