కేసీఆర్ గిరిజన వ్యతిరేకి : రేవంత్ రెడ్డి

Congress Leader Revanth Reddy
Congress Leader Revanth Reddy

Hyderabad: ప్రధాని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కొత్త చట్టాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో గిరిజన వ్యతిరేక ప్రభుత్వం ఉందని కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు. కేసీఆర్ గిరిజన వ్యతిరేకి అని ముద్ర వేయాలని అన్నారు. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని, రాష్ట్రపతి ఎన్నిక, నోట్ల రద్దు, ట్రిపుల్ తలాక్ అంశాలకు కేసీఆర్ ఆమోదం తెలిపారన్న విషయాన్ని ప్రజలు గమనించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ తలుచుకుంటే అసదుద్దీన్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/