పవన్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ అదేనట

A Still from Bheemla Nayak
A Still from Bheemla Nayak

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ను సంక్రాంతి బరినుండి తప్పించిన చిత్ర యూనిట్..న్యూ ఇయర్ కానుకగా అభిమానులకు ఓ గిఫ్ట్ అందించబోతుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన పాటను న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేయబోతుంది. సాధార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ సినిమాలో పాట రిలీజ్ అంటేనే ఫ్యాన్స్ చేసే హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇప్పుడు ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాడిన పాట‌.. అది కూడా న్యూ ఇయ‌ర్ రోజున రిలీజ్ అవుతుందంటే అభిమానుల చేసే హడావుడి మ‌రో రేంజ్‌లో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే ‘భీమ్లా నాయక్’ సినిమాకు అద్భుత‌మైన ట్యూన్స్ అందించిన మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ త‌మ‌న్‌, స్వ‌యంగా పవ‌న్ క‌ళ్యాణ్ పాడుతున్న పాట‌కు ఎలాంటి ట్యూన్ అందించారో తెలియాలంటే మాత్రం మ‌రో ఐదు రోజులు ఆగాల్సిందే.

సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న భీమ్లా నాయ‌క్ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, రైట‌ర్ త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, మాట‌ల‌ను అందించారు. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప‌వ‌న్ జోడీగా నిత్యామీన‌న్‌.. రానా ద‌గ్గుబాటి జోడీగా సంయుక్తా మీన‌న్ న‌టించారు. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌’కు రీమేక్‌గా రూపొందుతోన్న ‘భీమ్లా నాయక్’ను ముందుగా సంక్రాంతి బ‌రిలోకి, జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయాల‌ని ముందుగా నిర్మాత‌లు భావించారు. అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. కానీ ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు భారీ ఎత్తున విడుద‌ల‌వుతుండ‌టంతో స‌ద‌రు నిర్మాత‌లు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ‘భీమ్లా నాయక్’ నిర్మాత‌ల‌ను క‌లిసి రిక్వెస్ట్ చేయ‌డంతో ‘భీమ్లా నాయక్’ ను వాయిదా వేసి .. శివ రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేస్తున్నారు.