95 నుంచి 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం – కేసీఆర్

రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 95 నుంచి 100 అసెంబ్లీ సీట్లు గెలబోతున్నామని ధీమా వ్యక్తం చేసారు బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన బిఆర్ఎస్..ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాధించాలని చూస్తుంది. ఇదే క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ , బీజేపీ లు సైతం ఈసారి తెలంగాణ లో అధికారం చేపట్టాలని తహతలాడుతున్నాయి. ఎన్నికల పోలింగ్ కు 40 రోజులు మాత్రమే ఉండడం తో అన్ని పార్టీలు తమ ప్రచారం తో హోరెత్తిస్తున్నారు.

ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సైతం గత వారం రోజులుగా జిల్లాల పర్యటనలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. నిన్న శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. 95 నుంచి 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని కేసీఆర్ ప్రకటించారు. గజ్వేల్ నియోజకవర్గానికి ప్రతినెలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని, నియోజకవర్గంలో బహుళ అభ్యర్థులు ఉండాలన్నదే తన ధ్యేయమని ఉద్ఘాటించారు. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి పనులను గుర్తించిన కేసీఆర్ ఇంకా చేయాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. గజ్వేల్‌ను వదలబోనని, ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రతినెలా గజ్వేల్‌లో వస్తానని చెప్పిన కేసీఆర్.. గజ్వేల్‌లో తన మెజారిటీపై ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.