మనీష్ సిసోడియా అరెస్ట్పై స్పందించిన సీఎం కేసీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆదివారం 8 గంటలుగా మనీష్ సిసోడియాను సీబీఐ ప్రశ్నించింది. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. కాగా మనీష్ సిసోడియా అరెస్ట్ ను సీఎం కేసీఆర్ ఖండించారు. అదానీకి, ప్రధాని మోదీకి మధ్య ఉన్న అనుబంధం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసిన పని అని ఆరోపించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆదివారం అరెస్టయిన మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టగా ఐదు రోజుల కస్టడీకి అప్పగించింది. ఈ నెల 28 నుంచి మార్చి 4 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది. సిసోడియా అనేక మొబైల్ ఫోన్ల ద్వారా లిక్కర్ స్కాం నిందితులతో మాట్లాడారని, సాక్ష్యాలు లేకుండా చేశారని ఇవాళ వాదనల సందర్భంగా సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. లిక్కర్ విధానంలో కమీషన్ ను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచారని, లిక్కర్ విధానంలో చివరి నిమిషంలో మార్పు ద్వారా లైసెన్స్ పొందినవారికి ప్రయోజనం చేకూర్చారని సిసోడియాపై ఆరోపణలు చేశారు.