తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రా. (22 క్యా) రూ. 44,350

Hyderabad: బంగారం ధరలు తగ్గాయి. అసలే శ్రావణ మాసం లో బంగారం ధర పెరుగుతూ ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 44,350 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ. 48,380 కి చేరిది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కిలో వెండి ధర రూ. 500 పెరిగి రూ. 68,200 కి చేరింది .
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/