కేసీఆర్ పీఎం కావాలని కోరుకున్నా: మంత్రి మల్లారెడ్డి

నేడు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మల్లారెడ్డి

వరంగల్: రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈరోజు ఆయన ఇతర నేతలతో కలిసి మేడారం వెళ్లారు. అమ్మవార్లను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను కోరుకున్న మొక్కులను అమ్మవార్లు తీర్చారని తెలిపారు.

ఇక ఇప్పుడు కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని తాను కోరుకున్నానని చెప్పారు. తన కోరికను అమ్మవార్లు తీరుస్తారనే నమ్మకం తనకుందని అన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. ఇంకోవైపు లక్షలాది మంది భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది. వీవీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/