ప్రాజెక్ట్ కే నుండి మిక్కీ అవుట్..ఎవర్ని తీసుకున్నారంటే
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారులోకం, మహానటి, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, చందమామ కథలు, లీడర్, కేరింత వంటి హిట్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన మిక్కీ జె మేయర్..తాజాగా ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే నుండి తప్పుకున్నారు. ఆయనంతట ఆయన తప్పుకున్నారా..? లేక మేకర్స్ తప్పించారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈయన ప్లేస్ లో సంతోష్ నారాయణ ను తీసుకున్నట్లు నిర్మాత అశ్విని దత్ తెలిపారు.
బాహుబలి మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సాధించిన ప్రభాస్..ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ వంటి వరుస వరుస పాన్ మూవీస్ చేసి మరింత ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఒకటి , రెండు కాదు ఏకంగా నాల్గు పాన్ మూవీస్ ను లైన్ లో పెట్టాడు. వాటిలో ఆదిపురుష్ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె, మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ మూవీస్ చేస్తున్నాడు.
ఈ మూడు కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్నాయి. వీటిలో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేస్తున్న ప్రాజెక్ట్ కె చాల ప్రత్యేకం. ఈ మూవీ ఎవెంజర్స్ తరహాలో ఉండబోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ లో ప్రభాస్ కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ నటి నటులు ఈ మూవీ లో యాక్ట్ చేస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు.