రాజధాని లేని సిఎం‌ జగన్‌.. విశాఖలో ఫ్లెక్సీలు

రేపు విశాఖలో పర్యటించనున్న జగన్

CM Jagan without capital.. Flexi in Visakha

అమరావతిః ఏపి సిఎం జగన్‌కు వ్యతిరేకంగా విశాఖలో జన జాగరణ సమితి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జగన్ రేపు విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. రాజధాని లేని ముఖ్యమంత్రికి స్వాగతం సుస్వాగతం అని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. మరోవైపు రేపటి పర్యటనలో జగన్ భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టు మిగులు పనులు, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణాలకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత ఐటీ టెక్ పార్క్ కు శంకుస్థాపన చేస్తారు.