కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్​కు తప్పిన ప్రమాదం

ఆయన ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్‌ను ఢీకొన్న డేగ

karnataka-congress-president-dk-shivakumar-helicopter-was-hit-by-an-eagle-near-hoskote-

బెంగళూరుః కర్ణాటక కాంగ్రెస్​ అధ్యక్షడు డీకే శివకుమార్​కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్‌ను డేగ ఢీకొట్టింది. దాంతో హెలిక్యాప్టర్‌ అద్దం ఒకవైపు పూర్తిగా పగిలిపోయింది. హెలిక్యాప్టర్‌ ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో పెద్దగా ఎవరికీ ఏమీ కాలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీకే శివకుమార్‌ ములబగిలులో ఎన్నికల ప్రచారం కోసం ఇవాళ మధ్యాహ్నం హెలిక్యాప్టర్‌లో బయలుదేరారు. ఆ హెలిక్యాప్టర్‌ హోసకోట్‌ సమీపంలో ల్యాండ్‌ అవుతుండగా డేగ వచ్చి ఢీకొట్టింది. దాంతో హెలిక్యాప్టర్‌ అద్దం పగిలిపోయింది. దాంతో హెలిక్యాప్టర్‌లో ఉన్న డీకే శివకుమార్‌కు ఏమీ కాకపోయినా, ఆయన కెమెరామెన్‌కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.