నేడు తిరుపతిలో ప‌ర్య‌టించ‌నున్న సీఎం జ‌గ‌న్‌

అమరావతి : సీఎం జగన్ నేడు తిరుప‌తిలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. 11.05 గంటలకు తిరుపతి ఎస్‌వీ వెటర్నరీ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత ఎస్‌వీ యూనివర్శిటీ స్టేడియం చేరుకుని జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతారు. అనంతరం జ‌రిగే బహిరంగ సభలో సీఎం జ‌గ‌న్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌కు చేరుకుని, అక్కడ టీటీడీ చిన్నపిల్లల ఆస్ప‌త్రి భవన నిర్మాణానికి సంబంధించి భూమిపూజలో పాల్గొంటారు. ఇక‌.. అక్కడ‌ ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న త‌ర్వాత‌ అక్కడి నుంచి టాటా కేన్సర్‌ కేర్‌ సెంటర్‌ కు చేరుకుని నూతన హాస్పిట‌ల్‌ను జ‌గ‌న్‌ ప్రారంభిస్తారు. కార్యక్రమం త‌ర్వాత‌ రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

కాగా, జిల్లాల విభజన త‌ర్వాత‌ తొలిసారి సీఎం జ‌గ‌న్ తిరుపతి జిల్లాకు వస్తున్నారు. దీంతో ఆయ‌న‌కు ఘన స్వాగతం పలికేందుకు జిల్లాలోని నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం భారీ జన సమీకరణ చేస్తున్నారు. మంత్రులు ఆర్కే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి తిరుపతి జిల్లాకు చెంది‌న ప్రజా ప్రతినిధులు అంతా ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/