రానున్న మూడు రోజులు భారీ వర్షాలు.. ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ

telangana-weather-another-three-days-rain-forecast-to-telangana

హైదరాబాద్ః రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్లు కుస్తాయని పేర్కొంది. మిగతా పాంత్రాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాలో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. సోమవారం నుంచి మంగళవారం వరకు కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.