15న పల్నాడు జిల్లాలో పర్యటించనున్న సిఎం జగన్‌

CM Jagan will visit Palnadu district on 15th

అమరావతిః ఈనెల 15న పలనాడు జిల్లాలో సిఎం జగన్‌ పర్యటించనున్నారు. మాచర్ల నియోజకవర్గంలో వరికపూడిసెల ప్రాజెక్టు పనులకు ఈ పర్యటన లో శ్రీకారం చుట్టనున్నారు. ఈ తరుణంలో మాచర్లలోని రాయవరం జంక్షన్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.

ఇక అటు ఆంధ్రప్రదేశ్ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. కరువు మండలాల ప్రకటనకు… పంటల బీమాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట మూడు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడంపై రైతులు మరియు ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై సీఎం జగన్ తాజాగా స్పందించారు. అర్హులైన రైతులందరికీ పంటల బీమా వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు.