కరోనా నివారణకు పవన్‌ కళ్యాణ్‌ విరాళం

రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు

pavan kalyan
pavan kalyan

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి విస్తరించకుండా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, నిత్యం పోరాటం చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున ఆర్ధిక సహయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ప్రకటించాడు.ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా లో ట్వీట్‌ చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి డొనేట్‌ చేస్తున్నానని, దీనిని కరోనా వ్యాపించకుండా చేసే పనులకు వెచ్చించాలని కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/